10వ డివిజన్ లో పాస్టర్లకు చేయూత

10వ డివిజన్ లో పాస్టర్లకు చేయూత



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని 10వ డివిజన్ లో ఉన్న క్రైస్తవ మందిరాలలో ఉన్న పాస్టర్లకు ఉచిత కూరగాయలు,నిత్యావసర వస్తువులు,1000రూపాయల నగదును పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత నిధులు వెచ్చించి నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని నగర బీసీ సెల్ అధ్యక్షుడు,10వ డివిజన్ ఇంఛార్జ్ ఉప్పల శేషు గౌడ్ తెలిపారు.ఆదివారం రామ్ నగర్,కమాటి హరిజనవాడలో పాస్టర్లకు ఉచితంగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, వెయ్యి నగదును అందజేసామన్నారు.డివిజన్ లోని దేవాలయాలకు,మసీదులలో ఉన్న అజాంలు,పూజరులకు నాలుగు రోజుల క్రితమే చేయూతనిచ్చామన్నారు.నిత్యం ప్రజా సంక్షేమ కోసమే పనిచేస్తున్న మంత్రి అనిల్ కుమార్ కి డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారుఈ కార్యక్రమంలో కార్యకర్తలు యాకుబ్, గిరి,సాల్మన్, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#