నాణ్యమైన కూరగాయలు కేజీ10₹లకే

నాణ్యమైన కూరగాయలు కేజీ10₹లకే



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని రామచంద్రా పురంలో నాణ్యమైన కూరగాయలు10₹లకే ప్రజలకు విక్రయించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ ల ఆదేశాలతో 10వ డివిజన్ కొండా శివారెడ్డి,గండి కోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో రామచంద్రాపురం ప్రజలకు నాణ్యత  గల కూరగాయలు కేజీ10₹లకే అందజేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో  ప్రజలకు తక్కువ ధరకు అందజేయాలని ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వెంకటేశ్వర్లు యాదవ్,కార్యకర్తలు రాజేష్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి,వెంకీ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#