10 నిమిషాల్లోనే తల్లి
వద్దకు బిడ్డని చేర్చిన సిఐ
★మతిస్థిమితం లేని బాలుడు మిస్సింగ్
★టెక్నాలజీ ద్వారా ఛేదించిన నవాబుపేట్ సిఐ వేమారెడ్డి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:మతి స్థిమితం లేని ఓ బాలుడిని టెక్నాలజీ ద్వారా10 నిమిషాల్లోనే తల్లి వద్దకు నవాబుపేట్ సిఐ వేమారెడ్డి చేర్చారు.వివరాల్లోకి వెళ్ళితే స్థానిక కిసాన్ నగర్ వేణుగోపాల్ నగర్ కి చెందిన వెంకటేశ్వర్లు, లావణ్య దంపతులు 12ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడు ఇంట్లోనే ఆడుకుంటూ ఆడుకుంటూ కనిపించలేదు.ఇంతలో సోడా బండి నడుపుతూ జీవనం సాగించే వెంకటేశ్వర్లు ఇంటికి రాగానే కుమారుడు యస్వంత్ కనిపించక పోవడంతో భర్తని ఆరా తీయగా తనకేమీ తెలియదు.నీ వద్దనే ఉండాలిగా అంటూ భర్త వెంకటేశ్వర్లు లావణ్య కి బదులిచ్చారు.దీనితో మతి స్థిమితం లేని తన బంగారు బాబు ఎక్కడికెళ్లాడో చుట్టూ ప్రక్కల వారిని ఆరా తీస్తూ ఫలితం లేకపోవడంతో బోరున విలపిస్తూ నవాబుపేట్ పోలీసులను ఆశ్రయించింది.వెంటనే ఆ స్టేషన్ సిఐ వేమారెడ్డి స్పందించి ఆమెను ఓదార్చి మీ కుమారుడుని మీకు చేర్చుతాం,భయపడకండి అని ఆమెకు ధైర్యం చెప్పి వెంటనే పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.బాలుడు ఆచూకీ కోసం టెక్నాలజీ ని ఉపయోగించి 10నిమిషాల్లోనే కనుగొన్నారు.
బాలుడు కిసాన్ నగర్ ,నవాబుపేట్ లో మిస్సయి దర్గామిట్టపోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యాడు.వెంటనే అక్కడ సిఐ నాగేశ్వరమ్మ స్పందించి నవాబుపేట్ సిఐ కి సమాచారం అందించారు.దీనితో బాలుడు కోసం తల్లడిల్లుతున్న ఆతల్లికి కుమారుడు యస్వంత్ ని అప్పగించారు.దీంతో తల్లికి బిడ్డను చూడగానే కంటి నిండా నీరు కారుతున్న బిడ్డను అక్కున చేర్చుకుని సిఐ వేమారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.పోలీసులు లేకపోతే తమ బిడ్డ తనకు దక్కేవాడు కాదని ప్రత్యేకంగా సిఐ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె తెలిపింది.#ఎస్పీన్యూస్#