లాక్ డౌన్ లో రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు ఏది వరాలు..!?
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: రేషన్ కార్డ్ ఉన్న వారికి ప్రభుత్వాలు వరాలు జల్లులు కురిపిస్తున్నాయి.అయితే కార్డ్ లేని నిరుపేదలకు ఈ లాక్ డౌన్ లో ప్రభుత్వాలు వారికి ఏవిధమైన చేయూత అందించడంలేదని నిరుపేదలు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డ్ లేని నిరుపేదలయిన తమను సీఎం జగన్ ఆదుకోవాలని బడుగులు కోరుతున్నారు.కార్డు ఉన్న వారికి రేషన్ బియ్యం,పప్పు ,చక్కెర ఉచితంగా ఇస్తూ, 1000రూపాయలు నగదు ఇస్తారని, తమను సీఎం ఆదుకోవాలని నిరుపేదలు కోరుతున్నారు.కొంత మంది పేదలకు రేషన్ కార్డులు లేవని వారికి కూడా సీఎం వరాలు జల్లు కురిపించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.