జనతా కర్ఫ్యూ రెండవ రోజు రోడ్లపై జనాలు.
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: కరోనా వ్యాధిని అదుపుజేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ పాటించాలని అపుడే వారి ఆరోగ్యంగా ఉంటారని పలువురు ప్రజా సంక్షేమ సంఘాలు తెలుపుతున్నాయి. అలాగే పోలీసులు కూడా వారి విధుల్లో సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సూచనలిస్తున్నారు.
స్టేట్ పాలిటిక్స్ పత్రిక విభాగం నగర విధులను పరిశీలించింది.ఖాళీగా ఉన్న రోడ్లు, ముఖ్య కూడలిలు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ మార్కెట్ లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.ఎవరు అధిక ధరకు కొనాల్సిన పని లేదని సాధారణ ధరలకే నిత్యావసర వస్తువులు లభిస్తాయని జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు.ఎవరైనా అధిక ధరకు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ఉదయం నుండి పలు షాప్ లు ,జన సమ్మర్థత కలిగిన ప్రదేశాలను పరిశీలించి ప్రజలకు, వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి,నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ నగరంలో విస్తృతంగా పర్యటించారు.
ప్రజలు ఎక్కువ సేపు బయట ఉండరాదని ఇంటికి వెళ్లి వ్యక్తిగత శుభ్రత పాటించాలని వారు కోరారు.రెండవ రోజు ప్రజలు రోడ్లపైకి రావడంతో అధికారులు అవగాహన కలిపిస్తున్నారు.కరోనా వ్యాధిని అరికట్టాలంటే ప్రజలు సహకరించాలని అందుకు ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు పాటించడమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని అన్నారు.