రేషన్ షాపుల వద్ద ప్రజల పరేషాన్ ని పరిశీలించిన కొండా
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రేషన్ సరుకులు బియ్యం,కందిపప్పు సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో నని పలు రేషన్ షాప్ లను 10వ డివిజన్ వైసీపీ నాయకులు కొండా శివారెడ్డి పరిశీలించారు.రేషన్ షాపుల వద్ద ప్రజలు పరేషాన్ అవుతున్నారు. స్థానిక 8,10,36 షాపుల వద్ద బారులు తీరిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసారు.అందరూ క్యూలైన్ లో సోషల్ దూరం పాటిస్తూ..ముఖానికి మాస్క్ లు ధరించాలని,ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తారని అది10రోజులు అధికారులు అమలు చేస్తారని ప్రజలందరు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు ప్రసాద్ రెడ్డి,శ్రీకాంత్, రాజా తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#