ఏపీలో వాలంటరీల పై పోలీస్ జులుం,లాఠీ దెబ్బలు..!?
న్యూస్ ఫోర్స్,(నెల్లూరు,తూగో): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వం ప్రజా సేవకు ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటరీల వ్యవస్థ.అటువంటి జగన్ ప్రవేశ పెట్టిన వ్యవస్థని అడ్డుకోవడమే కాదు ,వారికి లాఠీ దెబ్బలు రుచి చూపించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.రాష్ట్రంలో కరోనా నివారణకు త్వరితగతిన పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రత్యేకంగా జగన్ ప్రభుత్వం వారిని డోర్ టు డోర్ తిరిగి కరోనా బాధితులను కనుగొనే బృహత్తర కార్యక్రమానికి సమిధులుగా మారారు. అలాంటి వారి పనులకు పోలీసులు విఘాతం కలిగించినదే కాక వారిని నోటికొచ్చినట్లుగా బూతులు తిట్టి,వారిపై లాఠీ ఝుళిపించారు.సర్వే చేసే ఫోన్లను పగలగొట్టే స్థాయిలో శృతి మించిపోతోంది పోలీసుల చర్యలు.పరిమితికి మించి కొందరు పొలీస్ ల ఓవరాక్షన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టబడుతుంది.ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న వాలంటరీల ను కించపరుస్తూ మరింత హీనంగా మాట్లాడిన సంఘటన నెల్లూరు నవాబ్ పేట్ లో చోటుచేసుకుంది. అలాగే వాలంటరీల సర్వేని అడ్డుకుని వారిపై పోలీస్ జులుం చూపిస్తూ లాఠీ ఝుళిపించిన సంఘటన రాజమండ్రి లో చోటుచేసుకుంది.దీనితో వాలంటరీలు మాకొద్దు బాబాయ్ ఈ ఉద్యోగాలు పనిచేస్తే దానితో పాటు జీతం తో పాటు లాఠీ దెబ్బలు,రాయలేని బూతులు అదనంగా లభిస్తున్నాయని వాపోతూ,మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్క చెబుతున్న కొందరు పోలీసులు ఓవరాక్షన్ ఇందుకు సంబంధించి కారణమవుతున్నాయి.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పిస్తున్నారు. వీరి వ్యవహారశైలి పై ఉన్నతాధికారులు కఠినంగా చర్యలు తీసుకుంటే గాని మరల పునరావృతం కావని చెప్పకనే చెప్పవచ్చును.#ఎస్పీన్యూస్#