సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్ష విరాళం అందజేసిన తుంగా
న్యూస్ ఫోర్స్,ఆత్మకూరు:ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిగా రూపాంతరము చెందిన కోవిడ్19 వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో నివారణకు
సంగం మండలము, తరుణవాయి గ్రామస్తులైన తుంగా దయాకర్ రెడ్డి తన వంతుగా లక్ష రూపాయల చెక్కును రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అందజేశారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా సి.యం రిలీఫ్ ఫండ్ కు( రూ. 1,00,000/- లు) లక్ష రూపాయలు విరాళము అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతం రెడ్డి ఆయన ని ప్రశంసిస్తూ కరోనా నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందజేయాలని పిలుపునిచ్చారు.#ఎస్పీన్యూస్#