కేఈ రాజీనామా..! వైసీపీలో చేరేందుకు సిద్ధం..!?
★చక్రం తిప్పిన మంత్రి అనిల్,త్వరలో సీఎంతోభేటి
★కేఈ కి వైసీపీలో కీలక పదవి..!?
న్యూస్ ఫోర్స్,కర్నూలు:టీడీపీలో ఉన్న సీనియర్లు,మంచి పట్టున్న నేతలను వైసీపీలోకి చేర్పించేందుకు పలువురు మంత్రులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.కొందరు దూసుకుపోతున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా లో మంచి పట్టున్న కేఈ బ్రదర్స్ అయిన కేఈ ప్రభాకర్ ని వైసీపీలోకి మంత్రి అనిల్ ఆహ్వానించారు. వైసీపీలోకి వస్తే మంచి కీలకమైన పదవిని ఇచ్చేందుకు కూడా సీఎం సుముఖత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న ఇరిగేషన్ మంత్రి అనిల్ కు ఎక్కడా ఇబ్బందిలేకుండా సజావుగానే తనపనులు ముగించుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు.నమ్ముకున్న వ్యక్తులకు బాసటగా నిలుస్తూ వైసీపీ పార్టీను పటిష్ఠ పరుస్తూ స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎక్కువ స్థానాల్లో ఎగురవేసేందుకు చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతానికి కేఈ తన ఎమ్మెల్సీ పదవికి,టీడీపీకి రాజీనామా చేశారు.త్వరలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.నేడో.. రేపో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తన సహచరులు గుస గుసలాడుతున్నారు.ఏదిఏమైనా టీడీపీని రాష్ట్రములో స్థానిక సంస్థలు ఎన్నికల పేరుతో భారీ దెబ్బ కొడుతొంది వైసీపీ.ఆపరేషన్ టీడీపీ అన్నట్లు గట్టి నాయకుల్ని వైసీపీ వశం చేసుకుంటూ టీడీపీని అన్ని ప్రాంతాల్లో బలహీనపరుస్తున్నారు.#ఎస్పీన్యూస్#