రేషన్ షాప్ ల వద్ద ప్రజలకు సక్రమంగా సరుకులు-వైసీపీ నేత రఘు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ఏర్పడడంతో ప్రజలకు రేషన్ షాప్ ల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైసీపీ 8వ డివిజన్ ఇంఛార్జ్ రఘు ప్రత్యేక శ్రద్ధ చూపారు.తన కార్యకర్తలతో ఉదయం6గంటల నుండి .స్థానిక రామచంద్రాపురం, గాంధీ గిరిజన కాలనీ కాలువ గట్టు వద్ద 8వ నెంబర్ షాప్ వద్ద ఉంటూ రేషన్ సరుకులు సక్రమంగా అమలు అయ్యేలా చూసారు.అంతేకాదు వృద్ధులకు వారి వారి సరుకులను వారి ఇంటి వరకు తీసుకెళ్లి దిగ బెట్టారు.ఈ కార్యక్రమంలో విఆర్వో అపర్ణ, వైసీపీ కార్యకర్తలు సురేష్,కిరణ్, సచివాలయ సిబ్బంది సుజిత్,గోపి, వెంకట సుమన్,జయసూర్య తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#