ఐసోలేషన్ వార్డుల వసతుల పరిశీలించిన మంత్రి

ఐసోలేషన్ వార్డుల వసతుల పరిశీలించిన మంత్రి



న్యూస్ ఫోర్స్,నెల్లూరు :నగరంలోని డి.ఎస్.ఆర్. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు గల కరోనా వైరస్,  డిశీస్-19 క్వారంటైన్ వార్డును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ , నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. క్వారంటైన్ వార్డు ,ఐసోలేషన్ వార్డులలో ఏర్పాటు చేసిన వసతుల గురించి అడిగి తెలుసుకొని ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని అధికారులకు, వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీ సునంద, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#