దిశ కేసు సీఎం,మంత్రులపై నమోదు చేయాలి..!?

  దిశ కేసు సీఎం,మంత్రులపై నమోదు చేయాలి..!?


న్యూస్ ఫోర్స్,అమరావతి:రాష్ట్రములో జరుగుతున్న అరాచకం,మహిళలపై దాడులు, దళిత మహిళలను అడ్డుకుని బెదిరింపులు చేస్తున్న పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ పై దిశ చట్టం క్రింద కేసులు నమోదు చేసి నిజంగా చట్టాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు తెలపాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిజీపీని కోరారు.స్థానిక సంస్థలు ఎన్నికలు రాష్ట్రములో ఎక్కడ.. ఏ చోటా సజావుగా సాగలేదన్నారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికైన వారు టీడీపీ అభ్యర్థిని అడ్డుకుని ఎన్నిక కాబడ్డారే తప్ప ప్రజా అభీష్టం వారికి లేదన్నారు.ఎక్కడ గెలవబోమనే నెపంతో రాష్ట్రములో అలజడులు,అరాచకాలు, దాడులు చేస్తూ ఎన్నిక సాగిస్తూన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రములో శాంతి భద్రతలను కాపాడేవారే కరువయ్యారని,ఎన్నికలను సజావుగా ఈసీ జరపలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. తన40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇటువంటి అరాచకాలు ఎన్నికలు చూడలేదన్నారు.విపక్షాల పార్టీలు సైతం భయపడి పోతున్నారని,రాష్ట్రంలో ఎవ్వరిని స్వేచ్ఛగా ఎన్నికలో పాల్గొనియకుండా నియంతలా వ్యవహరిస్తున్న జగన్ కి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని ఆయన హితవుపలికారు.#ఎస్పీన్యూస్#