కరోనా వైరస్ అంటే నిర్లక్ష్యమా..!?

కరోనా వైరస్ అంటే నిర్లక్ష్యమా..!?



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా రోడ్డులపై ముఖానికి మాస్క్ లు లేకుండా తిరగడమేమిటని 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.స్థానిక డివిజన్ లోని రామచంద్రాపురం ప్రాంతంలో ఉన్న నిత్యావసర వస్తువులు అమ్మే షాపుల వద్ద గుమికూడిన జనాలకు అవగాహన కలిపించారు.మీ లాంటి వారు ఇలా నిర్లక్ష్యం చేయబట్టే చాలా మందికి వైరస్ వచ్చి అర్దాంతరంగా చనిపోయారని అన్నారు.ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే ప్రజలకు ఆ వ్యాధి సోకదని, లేదంటే ప్రమాద బారినపడి చనిపోతారని ఆయన ఆవేదన చెందారు.షాప్ ల వారు ఇకనైనా షాప్ లకు వచ్చే వారికి  మాస్క్ లుంటేనే సరుకులు అమ్మాలని, దూరం దూరంగా నిలబడి సరుకులును కొనుగోలు చేయాలని ఆయన వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగరాజు నాయుడు,ప్రసాద్ రెడ్డి,రాజేష్ రెడ్డి, రాజా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#