నిత్యావసర సరుకుల ధరలుకు రెక్కలొచ్చెన్..!?
★పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రెచ్చిపోతున్న వ్యాపారస్తులు.
★ఇబ్బందుల్లో ప్రజలు.
న్యూస్ ఫోర్స్, నెల్లూరు,ప్రకాశం:కరోనా వైరస్ సోకకుండా భారతావని లో ప్రతి భారతీయుడు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో దేశ ప్రధాని మోడీ, రాష్ట్ర సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఏకీభవించారు.జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జనసంచారం లేకుండా రోడ్డుపైన అందరూ ఇంటికే పరిమతమయ్యారు.దీనితో వ్యాధి బారిన ప్రజలు పడకుండా నివారణ చర్యలలో భాగంగా మార్చి 31వరకు లాక్ డౌన్
ప్రకటించారు. దీనితో నిత్యావసర సరుకులు మినహాయింపు పరిమితిని పెట్టారు. దీనితో రెచ్చిపోయినవ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ధరలను కొండెక్కించేశారు.కొంటే కొనండి లేదంటే లేదు అన్నట్లు ప్రతి చోటా వినవుడుతుంది.దీనివలన ప్రజలు పెరిగిన ధరలకు అల్లాడిపోతున్నారు. అసలే పనులు లేక వారం రోజులు ఇంటికే పరిమితమవుతుంటే తినడానికి ఇంత రేట్లు ఏమిటని నివ్వెరపోతున్నారు.ఒక ప్రక్క సీఎం నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పిననుఁ ఎవ్వరు వినిపించుకోకుండా దర్జాగా వారు ధరలను పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.ఆయా జిల్లాల కలెక్టర్ లను అదుపు చేయమని,పెంచిన వ్యాపారస్తులు పై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. స్పెషల్ స్కాడ్స్ నియమిస్తే కానీ వ్యాపారస్తులు ధరలను పెంచడం ఆపివేసి సాధారణ ధరలతోనే సరుకులు అమ్ముతారు.దీనిపై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారిస్తే కానీ ప్రజలకు ఇబ్బందులు ఉండవు.లేదంటే వారం రోజులు నరకయాతన అనుభవిమాచాల్సిందే.కరోనా వైరస్ వస్తుందో రాదో కానీ ఆకలి మంటలతో వారం రోజులు పస్తులుంటు అల్లాడిపోతారు.ప్రజలకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటే ఈ వారం రోజులు కూడా సీఎం చేపట్టిన లాక్ డౌన్ విజయవంతమవుతుందని చెప్పవచ్చు.అధికారులు,వ్యాపారస్తులు, ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వాలు విజయం సాధించగలవు.ఎంటువంటి వైరస్ అయిన సమష్టిగా పోరాడి వాటిని రూపిమపగలరు.#ఎస్పీన్యూస్#