నిరంతర శ్రమ జీవి.. కమిషనర్ మూర్తి

నిరంతర శ్రమజీవి.. కమిషనర్ మూర్తి


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వెనువెంటనే సమస్యలను పరిష్కరిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించే శ్రమజీవి అయిన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివియస్ మూర్తి పై స్టేట్ పాలిటిక్స్ ప్రత్యేక కథనం..



గతంలో నెల్లూరు ప్రజలకు సుపరిచితుడైన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. రెండోవ సారి మరల నెల్లూరు మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందున్నారు.అలాగే వివాద రహితుడిగా, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ మంచి వారుగా కింది స్థాయి ఉద్యోగుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చును.అంతేకాకుండా పాలక, ప్రతి పక్షము వర్గాలను కలుపుకుని వెళుతూ ఎటువంటి విభేదాలు వృత్తి రీత్యా రాకుండా పని చేసుకుంటూ ముందుకుసాగేవారు.తద్వారా ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉండటమే కాకుండా ఫోన్ చేసి సమస్య గురించి తెలిపిన వెంటనే ఆయా అధికారిని,సిబ్బందిని అదేశించి పని పూర్తి చేయించేవారు.ప్రజలలో కూడా శ(హ)భాష్ మూర్తి అని అనుకునేంతగా తన వృత్తిని కొనసాగించేవారు. అయితే గత15 రోజుల క్రితమే కమిషనర్ మూర్తి బదిలీ అంటూ జీవో విడుదల కావడం అది తాత్కాలికంగా స్తబ్దుగా ఉండిపోవడం కొన్ని కారణాలతో ఉన్నది.కానీ గత రెండు రోజులుగా నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మూర్తి బదిలీ అంటూ చక్కర్ల కొడుతుంది.ఇది విన్న కొందరు అధికారులు,సిబ్బంది అది నిజమైతే ఓ మంచి అధికారిని తమనుండి దూరం చేసుకుంటున్నామని ఆందోళనలో పడుతున్నారు.ఏది ఏమైనా నెల్లూరు నగరంలో


కమిషనర్ మూర్తి రొట్టెల పండుగ,సంక్రాంతి పండుగ వేడుకలకు పెన్నా వారధి,నెల్లూరు చెరువు వద్ద ఏర్పాట్లు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేసి ప్రజలు మన్ననలు, అధికారుల ఆశీస్సులు పొందారనడంలో అతిశయోక్తి లేదు.అదేవిధంగా కరోనా నివారణకు నిరాటంకంగా రాత్రి, పగలు తేడా లేకుండా డివిజన్ లలో పరిశుభ్రత,బ్లీచింగ్,ప్రజలకు అవగాహనతో పాటు పలు
సూచనలు,శానిటైజర్స్,మాస్క్ లు పంపిణి కార్యక్రమం చేపట్టారు.నగరంలో ఒక్క కోవిడ్19 పాజిటివ్ కేసు నమోదు కాకుండా తాను, తన సిబ్బందిని  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగు  చర్యలు తీసుకున్నారు. ప్రజా క్షేత్రంలో అధికారులకు బదిలీలు సర్వసాధారణమే. అయితే కమిషనర్ మూర్తి పనితీరు, సేవలు నెల్లూరు ప్రజలు, కార్పొరేషన్ ఉద్యోగులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు.#ఎస్పీన్యూస్#