లాక్ డౌన్ లో ప్రభుత్వమే కూరగాయలు అమ్మకాలు-ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని 10వ డివిజన్ లో ఏర్పాటు చేసిన జగనన్న ప్రజా కూరగాయలు అమ్మకాలలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ,మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డి లు శ్రీకారం చుట్టారని 10వ డివిజన్ వైసీపీ నాయకులు కొండా శివారెడ్డి పేర్కొన్నారు. స్థానిక రామచంద్రాపురం షాజి మంజిల్,ఏసీ నగర్ అంగన్ వాడి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కూరగాయలు రేట్లు ఎక్కువగా అమ్మితే తమ దృష్టికి ప్రజలు తీసుకుని రావాలని,ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మకాలు సాగుతాయన్నారు.
ప్రజలు ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, వ్యక్తిగత దూరం, శుభ్రత తప్పక పాటిస్తే వారి దరి చేరదు కరోనా వైరస్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగరాజ్ నాయుడు,రాజేష్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి,రాజా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#