జనతా కర్ఫ్యూ ప్రజలందరూ సహకరించాలి.
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు అన్ని జనసంచారం బయటకు రాకుండా తగు చర్యలు తీసుకున్నారు నవాబుపేట్ పొలీస్ స్టేషన్ సిఐ వేమారెడ్డి.అలాగే కరోనా వ్యాధి ప్రజలు బయటకు వస్తే వ్యాప్తి చెందుతుందని ప్రజా ఆరోగ్య,రక్షే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ల ధ్యేయమని సిఐ స్టేట్ పాలిటిక్స్ పత్రికకు తెలిపారు.పూర్తి స్థాయిలో జనతా కర్ఫ్యూ ని అమలు చేశారు.ఉదయం8గంటల నుండి ప్రతిఒక్కరు రోడ్డుపైకి రాకుండా చూస్తున్నారు. ఒకవేళ వస్తే వారికి గులాబీ పూలు ఇచ్చి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రజలను బయటకు రాకుండా వేడుకున్నారు.ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద కోవిడ్19 నివారణకు ఓ బ్రోచర్ ని విడుదల చేసారు. మీ ఆరోగ్యమే మా పోలీసులు ధ్యేయమని ఆయన అన్నారు.దేశ ప్రధాని పిలుపు మేరకు,రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు తమ పోలీసులు ఆచరిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్సైలు రమేష్ బాబు,శివ ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#