అనుమానంతో భార్యని నరికి చంపిన భర్త

అనుమానంతో భార్యని నరికి చంపిన భర్త


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కట్టుకున్న వాడే కాలయముడుగా మారి 12సంవత్సరాలు కాపురం చేసిన భర్త ఆ ఇల్లాలిని నరికి నరికి చంపిన ఘటన నెల్లూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్ళితే నగరంలోని నవాబుపేట్ ,నాగేంద్ర నగర్ విజయభేరి అపార్ట్మెంట్ లో  వాచ్ మెన్ గా పనిచేస్తున్న పొంగూరు మణి గత మూడేళ్ళుగా అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మర్రిపాడుకు చెందిన పొంగూరు మణికి, చేజర్ల కి చెందిన మాధవికి 12సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి 9ఏళ్ల అబ్బాయి,6సంవత్సరాల అమ్మాయి ఉన్నారు.రెండేళ్లుగా భార్య ని అనుమానిస్తూ వుండేవాడు. ఇలా వారిద్దరి మధ్య ప్రతినిత్యం వివాదం చోటుచేసుకుంటూవుండేది.ఈ క్రమంలో గతరాత్రి ఇద్దరి మధ్య వివాదం జరిగి అది ప్రాణం తీసేందుకు దారితీసింది.మొద్దు కత్తితో అతి దారుణంగా ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు.అక్కడికక్కడే ఆమె మృతి చెందింది.తరువాత స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.ఈ మేరకు నవాబుపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.#ఎస్పీన్యూస్#