అధిక ధరలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకొండి.
ఎమ్మెల్యే కిలివేటి
న్యూస్ ఫోర్స్,నాయుడుపేట:నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోండని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు.ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సరోజినీ రెడ్డితో సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య కలసి అన్ని శాఖల అధికారులు , దుకాణదారులు మరియు వర్తకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు కూరగాయలు మరియు ఇతర సామగ్రి అధిక రేట్లకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు . మానవతా దృక్పథంతో ఈ సమయంలో తోటివారికి సాయం చేయాలని అంతే కానీ అధిక ధరకు విక్రయించడం భావ్యం కాదని దుకాణదారులు మరియు వర్తకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట తహశీల్దార్ జి శ్రీనివాసులు, డి టి సంధ్య,సిఐ వేణుగోపాల్ రెడ్డి,వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#