నెల్లూరులో కాలకేయులు..!?

నెల్లూరులో కాలకేయులు..!?


★వడ్డీలకు వడ్డీలు గుంజుడు


★బాధితులకు బెదిరింపులు,కొట్టడం


★మహిళలకు లైంగిక వేధింపులు..!?


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నెల్లూరు నగరంలో తండల్..తండల్ ,వడ్డీ వ్యాపారస్తులు ప్రజల పాలిట కాలకేయులుగా మారి జలగల్లా పట్టి పీడిస్తూన్నారు.


అవసరం నిమిత్తం అప్పు తీసుకున్న బాధితులకు వడ్డీ వ్యాపారస్తులు చుక్కులు చూపిస్తూ రక్తం పిండేస్తున్నారు.రోజూ వారి వడ్డీలు, వారం వారం వడ్డీలతో బడుగు,పేద, మధ్య తరగతి ప్రజలను అల్లాడిస్తూ వారి జీవితాలను దుర్భరంగా చేసేస్తున్నారు. దీనితో దిక్కు తోచని స్థితిలో బాధితులు కొందరు లోలోన క్రుంగిపోతూ,మరికొందరు తనువు చాలిస్తున్నారు.దీనిపై పోలీసులు దృష్టి సారించి కాలకేయులును అదుపు చేయకపోతే వారి మితిమీరిన ఆగడాలు హెచ్చుమీరుతాయి.ముఖ్యంగా తూర్పు ప్రాంతమైన నవాబుపేట్ ,బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తులు ఇబ్బందులుకు  గురిచేస్తున్నారని బాధితులు మొర పెట్టుకుంటున్నారు. #ఎస్పీన్యూస్#