రేపటి నుండి ఇంకా కఠినతరం-జేసీ వినోద్

రేపటి నుండి ఇంకా కఠినతరం-జేసీ వినోద్



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: రోజువారీ కూలీలకు పాస్ లు ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో  ఒకరికొకరు దూరంగా ఉండడం లేదని ,రేపటి నుండి ఇంకా కఠినతరం చేస్తామని జాయింట్ కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. బైక్ మీద ఒక్కరే రావాలని, కార్ అయితే ఇద్దరే ఉండాలన్నారు.రేపటి నుండి చాలా గట్టిగా అన్నీ
విషయాలు చూడడం జరుగుతుందని తెలిపారు.
అత్యవసర సరుకులకు అనేక మంది రాకూడదని,  రేపటి నుండి కుటుంబం నుండి ఒక్కరికే అనుమతన్నారు.వాకింగ్ చేయవద్దు ఇంట్లో యోగా చేయడం మంచిదని తెలిపారు. చిన్నపిల్లల ను తీసుకురావద్దు.ఉదయం 6 నుండి
మధ్యాహ్నం 1 గంట వరకు పెట్రోల్ అందుబాటులో ఉంటుందన్నారు. మధ్యాహ్నం సాధారణ ప్రజలకు
పెట్రోల్ ఇవ్వరని రోడ్లపై టీ తాగుతూ గుంపులుగా వుండకూడదన్నారు.29.3.20 నాటికి
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం,పప్పు  ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని,గ్రామంలో
రోజుకు వంద మందికి ఒక్క రోజు లో ఇస్తారు. రేషన్ షాప్ ల ద్వారా ఇస్తారని తెలిపారు. కూరగాయల ను 100/- ప్యాక్ తో కావలి, గూడూరు, నెల్లూరు లో
సంచార వాహనాల ద్వారా ప్రయోగాత్మకంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో చిల్లర సామాను అమ్మే రిటైల్, హోల్ సేల్ వ్యాపారస్థుల సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలిపారు.
మాంసాహారం అమ్మకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు కొనడం లేదని తెలిపారు.హెల్ప్ డెస్క్ కు చాలా ఫిర్యాదులు అందాయి.హోస్టెల్స్ వారు ఆపవద్దు అని సూచించారు. 0861 2326776 నంబరు కు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని తెలిపారు.