రేషన్ షాపుల వద్ద బారులు తీరిన ప్రజలు-పరిశీలించిన శివారెడ్డి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రెండోవ రోజు ప్రజలకు రేషన్ సరుకులు ఇచ్చే క్రమంలో సర్వర్ సరిగా పనిచేయలేదు. దీనితో ఆయా షాపుల వద్ద ప్రజలు బారులు తీరు గంటల కొద్దీ వేచి ఉండడంతో 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని ఈ రేషన్ సరుకులు ఇంకా వారం వరకు ఇస్తారని ఎవ్వరు ఎక్కువగా రాకుండా రోజుకు 100 మందికి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఎక్కువగా వేచి ఉండకుండా రేషన్ షాప్ లు వద్ద 100 మంది కన్యే ఎక్కువ మంది లేకుండా మరుసటి రోజు వచ్చి సరుకులు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. అలాగే సచివాలయం సిబ్బందికి పలు సూచనలిచ్చారు.ఈకార్యక్రమంలో నాగరాజు నాయుడు,రాజేష్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి,రాజా,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పిన్యూస్#