కోవిడ్ 19 ను మరింత సమర్థవంతంగా   టాస్క్ ఫోర్స్ కమిటీ 

కోవిడ్ 19 ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు  టాస్క్ ఫోర్స్ కమిటీ


 


న్యూస్ ఫోర్స్,అనంతపురం: జిల్లాలో కరోనా వైరస్ ను ( కోవిడ్ 19)  మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని  ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి యం.శంకరనారాయణ తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి జిల్లా కలెక్టర్  గంధం చంద్రుడు  చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, కమిటీలో హానరరీ సభ్యులుగా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జెసి ఢిల్లీ రావు, డి ఎం హెచ్ ఓ అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్  రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డి సి హెచ్ ఎస్ రమేష్ లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 


ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లాలో కరోనా వైరస్ విస్తరించకుండా అరికట్టేందుకు కీలకంగా వ్యవహరిస్తుందని, అన్ని రకాల చర్యలు తీసుకుని కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తారని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటారని తెలిపారు.#ఎస్పీన్యూస్#