కోవిడ్19 నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న జిల్లా మంత్రి అనిల్
★జిల్లాలో శానిటైజర్స్,మాస్క్ లు,ప్రజల్లో అవగాహన
★ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సమావేశంలో సూచనలు
★ప్రతి ఒక్కరూ పాటించేలా తానే స్వయంగా రోడ్లపై పర్యటన.
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాలో అధికారులను ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి అయినా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అప్రమత్తం చేసారు.తానే స్వయంగా నెల్లూరు నగర రోడ్లపై పర్యటించి ప్రజలకు పలు సూచనలు అవగాహన కల్పించారు. అంతేకాకుండా నెల్లూరు మునిసిపల్ అధికారులకు నగరంలో ఉన్న54 డివిజన్ లలో శానిటేషన్ చేసి బ్లీచింగ్ చేయించి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.అలాగే జిల్లాలో ఉన్న పలు ముఖ్య డివిజన్ కేంద్రాల అధికారులకు మంత్రి అనిల్ పలు ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక చర్య తీసుకుని ప్రజలకు అవగాహన కలిపించి ప్రభుత్వ సూచనలను తూచ తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తే జిల్లా నుండి కోవిడ్19 ని తరిమివేస్తామని అధికారులకు ఆయన సూచించడం జరిగింది.అలాగే కరోన బారిన పడితే సిద్ధంగా ఐ సోలేషన్ వార్డులు, సుమారు5వేలకు బెడ్డులు ఏర్పాటు చేశారు.
గత వారం రోజులుగా జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలు ప్రాంతాలను పరిశీలించడం అక్కడ స్థానిక అధికారులు, వైసీపీ నేతలతో మాట్లాడి ప్రజల్లో అవగాహన కలిపించి ఎవ్వరు బయటకు రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.ప్రజలకు అందుబాటులో మినీ కూరగాయలు సంచార కేంద్రాలను కూడా ఒక్క నెల్లూరు నగరంలోనే 100 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఏ వ్యాపారి పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకు అమ్మేల చర్యలు చేపట్టారు. ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం వలన జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.మంత్రి ప్రత్యేక చొరవతో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమై ఇటు రెవెన్యూ, వైద్య శాఖ,పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇలాగే ప్రజలందరు స్వీయ నియంత్రణ పాటిస్తే తామే స్వచ్ఛందంగా వారం రోజులు బయటకి రాకుండా ఇంటికే పరిమితమైతే నెల్లూరు జిల్లాకు కరోనా వైరస్ తాకదని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రజల్లో కూడా జిల్లా మంత్రి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో వారిలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.20రోజులకు సరిపడే నిత్యావసర సరుకుల కొనుగోలు చేసుకుని జిల్లా ప్రజలు వీలైనంత త్వరగా ప్రజలు బయటకు రాకుండా ఉండగలిగితే కోవిడ్19 నివారణ పూర్తిగా విజయం సాధించవచ్చు. అదే దిశగా జిల్లా అధికారులు మంత్రి సూచనతో ప్రజలకు అవగాహన కలిపిస్తున్నారు. రోజు రోజు కు రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నెల్లూరు జిల్లా ప్రజలు ఆ బారిన పడకుండా మంత్రి అనిల్ కుమార్ తనదైన శైలిలో ప్రత్యేక చొరవ చూపడమే జిల్లాలో కరోనా బారిన ప్రజలు పడకుండా అధికారులు శ్రమిస్తున్నారు.జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం ఉంటేనే కరోనా కాదు మరొక వ్యాధి దరిచేరదని మంత్రి అన్నారు. అలాగే స్వచ్ఛందంగా సమాజ సేవకులు లాక్ డౌన్ లో ఆహారం,మంచి నీరు,మజ్జిగ తదితర సదుపాయాలు అందజేస్తుండడం, పలువురు సామాజిక సృహ మానవత్వం చాటుకుంటున్నారని ఆయన అభినందించారు.#ఎస్పీన్యూస్#